మొబైల్ ఫోన్‌ దొరక్కపోవడంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి అతని తొమ్మిదేళ్ల కొడుకును గొంతు కోసి చంపాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలవల్‌పూర్ మాదయ్య గ్రామంలో జరిగింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత బుధవారం నాడు తండ్రిని హత్యానేరం కింద అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి తన మనవరాలు పాలక్ (4) ఎదుటే మిథున్‌ను హత్య చేశాడని బాధితుడి తాత లఖన్ సింగ్ తన కుమారుడు ముఖేష్ బాథమ్‌పై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ఫిర్యాదు మేరకు బాథమ్‌ మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చాడు. మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టుకున్నాడో మరిచిపోయి కొడుకుని అడిగాడు. కానీ మిథున్ దానిని కనుగొనడంలో విఫలమయ్యాడు. కోపంతో బాథమ్ తన కొడుకును గొంతుకోసి చంపాడు. ఈ దారుణ హత్యను చూసిన బాధితురాలి చెల్లెలు పాలక్ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె కేకలు విన్న ఆమె తాత అక్కడికి చేరుకున్నాడు. అయితే ఆ సమయానికి మిథున్ మరణించాడు. తండ్రి బాథమ్‌ ఇంటి నుండి పారిపోయాడు.

బాథమ్ మద్యానికి బానిస అని, అతని అలవాట్ల కారణంగా, అతని భార్య విజయ్ కుమారి ఎనిమిది నెలల క్రితం తమ ఆరుగురు పిల్లలలో నలుగురితో కలిసి ఇల్లు వదిలి పంజాబ్‌కు వెళ్లారని లఖన్ సింగ్ పోలీసులకు చెప్పాడు. మిథున్, పాలక్ తమ తండ్రి వద్దే ఉంటున్నారు. ఐపీసీ సెక్షన్ 304 (అపరాధపూరితమైన నరహత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు కిస్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధర్మేంద్ర కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి విచారణ జరుపుతున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story