బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మ‌ర‌ణం

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.

By Medi Samrat  Published on  17 Feb 2024 3:00 PM IST
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మ‌ర‌ణం

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. శనివారం జరిగిన పేలుడులో తొమ్మిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండడంతో టపాసుల ఫ్యాక్టరీతో పాటు నాలుగు భవనాలు ధ్వంసమయ్యాయి. నగరంలోని వెంబకోట్టై ప్రాంతంలో విజయ్ అనే వ్యక్తికి చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఫ్యాక్టరీలోని కెమికల్ మిక్సింగ్ రూమ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని పలు బాణసంచా కర్మాగారాల్లో ఇలాంటి పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.

Next Story