పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థిపై దాడి.. 9 మంది పోలీసులు అరెస్ట్

9 cops held for assaulting law student inside police station in Chennai. తమిళనాడులోని పోలీస్ స్టేషన్‌లో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిపై దాడి చేసినందుకు కొడుంగయ్యూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌తో సహా

By అంజి  Published on  21 Jan 2022 3:58 PM IST
పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థిపై దాడి.. 9 మంది పోలీసులు అరెస్ట్

తమిళనాడులోని పోలీస్ స్టేషన్‌లో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిపై దాడి చేసినందుకు కొడుంగయ్యూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌తో సహా తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని అరెస్టు చేశారు. రాజధాని చెన్నైలోని కొడుంగయ్యూర్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించడంపై జరిగిన గొడవ తర్వాత పోలీసు సిబ్బందిపై దాడి చేశారనే ఆరోపణలపై అబ్దుల్ రహీమ్ అనే న్యాయ విద్యార్థిని కొడంగయూర్ పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పోలీసులపై దాడి చేశారని ఆరోపిస్తూ మరుసటి రోజు రిమాండ్‌కు తరలించారు.

పోలీసు స్టేషన్‌లోనే యువకుడిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. కాగా విద్యార్థి తరఫు న్యాయవాది హరిహరన్, తన క్లయింట్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారని, తద్వారా తలపై కుట్టు వేయాల్సి వచ్చిందని ఆరోపించారు. గాయాలతో ఉన్న యువకుడి చిత్రాలు వైరల్ కావడంతో, చెన్నై కమిషనర్ ఆఫ్ పోలీస్ ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా కొడుంగయ్యూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. పోలీసు స్టేషన్‌లో పోలీసులు తనపై దాడి చేస్తున్న దృశ్యాన్ని అతను రికార్డ్ చేసిన వీడియోను కూడా యువకుడు విడుదల చేశాడు.

విచారణలో ఇద్దరు పోలీసులను శనివారం "వేకెన్సీ రిజర్వ్" కింద ఉంచారు. కొడుంగయ్యూర్ స్టేషన్‌లోని పోలీసులు స్టేషన్‌లోని సిసిటివిలో యువకులతో వారు వ్యవహరించిన తీరు రికార్డ్ చేయబడలేదని నిర్ధారించుకున్నారు. రెండు పక్షాలకు తగిన ప్రాతినిథ్యంతో న్యాయమైన రీతిలో విచారణ జరుగుతుందని పోలీసు కమిషనర్ తెలిపారు.ప్రాథమిక విచారణలో, విద్యార్థిపై పోలీసు సిబ్బంది మూత్ర విసర్జన చేయడం వంటి అభియోగాలు అబద్ధమని తేలిందని వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి అశాంతి కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత సందేశాలను పోస్ట్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. ఎవరైనా అలాంటి సందేశాలను పోస్ట్ చేస్తే క్రిమినల్ చర్యకు గురవుతారు. తనపై ఉన్న సెక్షన్లను మార్చి ఆదివారం బెయిల్‌పై విడుదల చేసినందుకు ఉన్నతాధికారులకు విద్యార్థి సోషల్ మీడియా పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని కొట్టిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని విడుతై చిరుతైగల్ కట్చి సహా కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.

Next Story