పండుగకు ఇంటికి తీసుకువచ్చి.. 8 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం

8-Year-Old Raped For Days By Uncle In Assam. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్న, పెద్ద, బంధువులు అనే తేడా లేకుండా దారుణాలకు

By అంజి  Published on  6 Feb 2022 11:54 AM IST
పండుగకు ఇంటికి తీసుకువచ్చి.. 8 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్న, పెద్ద, బంధువులు అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అస్సాం రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పండుగ కోసం ఇంటికి తీసుకుచ్చి.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మామ. ఎనిమిదేళ్ల బాలికపై కమ్రూప్ జిల్లాలోని తన తల్లిదండ్రుల స్థలం నుండి గౌహతికి తీసుకువచ్చిన తర్వాత ఆమె మామ చాలా రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి శనివారం తెలిపారు.

బాలిక తల్లిదండ్రులు సుల్‌కూచి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ స్థలంలో ఉంటున్నారు. గత నెల జనవరి మధ్యలో బిహు పండుగ సందర్భంగా ఆమె మామ ఆమెను గౌహతికి తీసుకెళ్లి చాలా రోజులు అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, బాలిక తన తల్లికి జరిగినదంతా చెప్పింది, ఆమె తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని అధికారి తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story