ప్రభుత్వ పాఠశాలలో ఇనుప గేటు మీద ప‌డి ఎనిమిదేళ్ల బాలిక మృతి

8-Year-Old Girl Dies After Iron Gate Falls On Her At School In Gujarat. గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలికపై

By Medi Samrat  Published on  26 Dec 2022 6:25 PM IST
ప్రభుత్వ పాఠశాలలో ఇనుప గేటు మీద ప‌డి ఎనిమిదేళ్ల బాలిక మృతి

గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలికపై ఇనుప గేటు పడడంతో.. ఆ బాలిక మృతి చెందినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. డిసెంబరు 20న రాంపుర గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె తలకు గాయాలై మరణించిందని అధికారి తెలిపారు.

పాఠశాల కాంపౌండ్‌పై ఉన్న భారీ ఇనుప గేటు దగ్గరగా బాధితురాలు అష్మితా మోహనియా ఆడుకుంటూ ఉంది. అనుకోని విధంగా పెద్ద గేటు ఆమెపై పడిందని జిల్లా ప్రాథమిక విద్యాధికారి మయూర్ పరేఖ్ తెలిపారు. బాలిక తలకు బలమైన గాయాలు కాగా ప్రాథమిక చికిత్స కోసం దాహోద్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆయన తెలిపారు. ఈ సంఘటన తర్వాత, పాఠశాల ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు పరేఖ్ తెలిపారు.


Next Story