8 ఏళ్ల బాలుడిని చంపిన తల్లి ప్రియుడు.. సంబంధానికి అడ్డొస్తున్నాడని..

8 ఏళ్ల బాలుడిని గొంతు కోసి హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

By అంజి  Published on  25 Oct 2024 1:21 AM GMT
boy killed, lover, UttarPradesh, Ghaziabad, arrest, Crime

8 ఏళ్ల బాలుడిని చంపిన తల్లి ప్రియుడు.. సంబంధానికి అడ్డొస్తున్నాడని..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 8 ఏళ్ల బాలుడిని గొంతు కోసి హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. అక్టోబరు 23న బాలుడి తల్లి తన కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో మిస్సింగ్‌ ఫిర్యాదును దాఖలు చేసింది. ఆ తర్వాత పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు మహేష్ గుప్తాను అరెస్టు చేసి కాలుకు కాల్చారు. అరెస్టు తర్వాత నిందితుడు ఆసుపత్రి పాలయ్యాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కుమారుడు ఆకాష్‌ అక్టోబర్‌ 22న సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫిర్యాదు తర్వాత, పోలీసులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు.

ఘజియాబాద్ సిటీ ఫారెస్ట్ ప్రాంతంలోని నిర్జన ప్రదేశం నుండి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఘజియాబాద్ డిసిపి రాజేష్ గుప్తా తెలిపారు. బాలుడి మెడపై గాయం గుర్తులు ఉండడంతో తాడుతో గొంతుకోసి హత్య చేసి ఉంటాడని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని స్కాన్ చేసి, ఆ ప్రాంతంలో శీతల పానీయాల దుకాణం నడుపుతున్న దుకాణదారుడు మహేష్ గుప్తాతో చిన్నారిని చూసిన తర్వాత అరెస్టు చేశారు. సుదీర్ఘ గాలింపు తర్వాత పోలీసులు గుప్తాను చుట్టుముట్టినప్పుడు, అతను వారిపై కాల్పులు జరిపాడు. ఎన్‌కౌంటర్ జరిగింది.

"విచారణ సమయంలో, నిందితుడు బాలుడి తల్లితో సంబంధం కలిగి ఉన్నాడని మాకు చెప్పాడు. అయితే సంబంధాన్ని పిల్లవాడు వ్యతిరేకించాడు. గుప్తా ఆకాష్‌ను తమ సంబంధానికి అడ్డంకిగా భావించి, అతనిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు" అని డీసీపీ కుమార్ చెప్పారు. ఆకాష్ తల్లితో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడల్లా అతడిని అలా చేయనివ్వలేదని గుప్తా చెప్పాడు. ఘటన జరిగిన రోజు ఆకాష్ సైకిల్‌పై ఇంటి నుంచి బయలు దేరితే మహేష్ గుప్తా శీతల పానీయం ఇస్తాననే నెపంతో అతడిని ఆపి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం తాడుతో బాలుడిని గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) యొక్క సంబంధిత సెక్షన్ల కింద హత్య కేసును నమోదు చేశారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story