ఆ సంచుల్లో ఏమున్నాయంటే..
709 turtles stuffed in shaking sacks. ఈ ఫోటోలోని సంచుల్లో ఏమున్నాయో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే అందులో
By Medi Samrat Published on 17 March 2022 2:10 PM GMTఈ ఫోటోలోని సంచుల్లో ఏమున్నాయో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే అందులో ఉన్న తాబేళ్లు. 10 లక్షల విలువైన తాబేళ్లతో వెళ్తున్న స్మగ్లర్లను ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్‌ను అరెస్టు చేయగా ఏకంగా 709 తాబేళ్లు అతడి దగ్గర లభ్యమయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో ఈ తాబేళ్ల ధర దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.
ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు బిదుమా పోలీసులు కొత్వాలి ప్రాంతంలో దాడి చేశారు. ఈ క్రమంలో ఓ తాబేలు స్మగ్లర్ పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 709 తాబేళ్లు లభ్యమయ్యాయి. పెద్ద సంఖ్యలో తాబేళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అటవీశాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు స్మగ్లర్ల వద్ద దొరికిన తాబేళ్లను పరిశీలించగా.. వాటి సంఖ్య 709 ఉన్నాయి. ప్రపంచ మార్కెట్‌లో దొరికిన తాబేళ్ల విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని, ఇన్‌ఫార్మర్ సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు.
పోలీసులు వెళ్లినప్పుడు గోనె సంచెలు కదులుతూ కనిపించాయి. గోనె సంచిని తెరిచి చూడగా అందులో తాబేళ్లు కనిపించాయి. దీంతో పాటు డ్రమ్ముల్లో కొన్ని తాబేళ్లు కూడా కనిపించాయి. కేసు నమోదు చేసి స్మగ్లర్‌ను జైలుకు తరలించారు. విచారణలో, స్వాధీనం చేసుకున్న తాబేళ్లన్నీ చంబల్ నది,ఇతర నదుల నుండి పట్టుకున్నారని తెలిసింది.