విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆడి కారు.. ఎమ్మెల్యే కొడుకు సహా ఏడుగురు దుర్మరణం
7 including Congress MLA's son, killed in car crash in Koramangala. కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on
31 Aug 2021 3:43 AM GMT

కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హోసూరుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు, కోడలు సహా ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగళ్ కన్వెన్షన్ హాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన కారు విద్యుత్ పోల్‌ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో కారులో ఉన్న ఏడుగురిలో.. ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో డీఎంకే నేత, హోసూరు ఎమ్మెల్యే వై ప్రకాష్ కుమారుడు కరుణ సాగర్, కోడలు బిందు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతావారిని గుర్తించాల్సివుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమైవుండొచ్చని పోలీసులు బావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story