మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడు వాహనాలు ఒకదానికొకటి ఢీ.!

7-8 vehicles crashed into each other in maharashtra. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఏడు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ధూలేలో జరిగిన ఈ

By అంజి  Published on  28 Oct 2021 10:22 AM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడు వాహనాలు ఒకదానికొకటి ఢీ.!

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఏడు వాహనాలు ఒకేసారి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ధూలేలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు స్థానికుల సాయంతో తీవ్రంగా దెబ్బతిన్న వాహనాల నుండి మృతులను బయటకు తీసి దగ్గరిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘోర ప్రమాదంలో వాహనాలు భారీగా ధ్వంసం అయ్యాయి.


Next Story