ఏటీఎం లో డబ్బులు కొట్టేయడమే కాదు.. కాల్చి పడేశారు

60 lakh blown away by cutting ATM. శుక్రవారం అర్థరాత్రి కారులో వచ్చిన దొంగలు రెండు ఏటీఎంల నుంచి రూ.60 లక్షలను ఎత్తుకెళ్లారు

By Medi Samrat  Published on  30 Jan 2022 11:56 AM GMT
ఏటీఎం లో డబ్బులు కొట్టేయడమే కాదు.. కాల్చి పడేశారు

రాంచీ: శుక్రవారం అర్థరాత్రి కారులో వచ్చిన దొంగలు రెండు ఏటీఎంల నుంచి రూ.60 లక్షలను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఓ ఏటీఎంకు నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో శనివారం రాత్రి వరకు కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. రాంచీలోని హాజీ చౌక్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో పగులగొట్టిన దొంగలు సుమారు రూ.35 లక్షలను ఎత్తుకెళ్లారు. అదే వ్యక్తులు మఖ్మాండ్రోలోని Paytm పేమెంట్స్ బ్యాంక్ ATM నుండి 24 లక్షలు కొట్టేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న రూరల్ ఎస్పీ నౌషాద్ ఆలం బృందంతో వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బృందం అక్కడి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకుంది. హాజీ చౌక్‌లోని ఏటీఎంలో రూ. 40 లక్షలు (పూర్తి సామర్థ్యం) పెట్టినట్లు బ్యాంక్ అధికారి తెలిపారు.

చోరీ జరిగిన విషయం తెలియక ముందే ఎంత డబ్బు డ్రా అయింది? అనే విషయాన్ని పరిశీలించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా సిట్‌ను ఏర్పాటు చేశారు. డీఎస్పీ హెడ్‌క్వార్టర్స్-II ప్రవీణ్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని జైలులో పెట్టాలని ఈ బృందాన్ని ఆదేశించినట్లు సమాచారం. రెండు ఏటీఎంలలో గార్డులు లేరని, గార్డుల నియామకం కోసం రాంచీ పోలీసులు రెండు బ్యాంకులకు పలుమార్లు లేఖలు పంపినా బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.


Next Story
Share it