శంషాబాద్‌లో దారుణం

శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

By Medi Samrat  Published on  23 July 2024 8:30 PM IST
శంషాబాద్‌లో దారుణం

శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు శంషాబాద్‌లోని సిద్ధాంతి గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. బాలిక తల్లిదండ్రులు రోజువారీ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు.

నిందితుడిని మహబూబ్‌నగర్‌కు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. అతని భార్య ఎక్కడికో వెళ్లడంతో అతని నివాసంలో ఒంటరిగా ఉన్నాడు. నిందితుడు సమీపంలోనే ఉంటున్న బాధితురాలిని తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుపును విన్న స్థానికులు నిందితుడిని చితకబాదారు. కొద్దిసేపటికి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story