బాలికపై అత్యాచారం.. సీసీటీవీలో నిందితుడు

6 Year old girl raped in west delhi. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 6 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం జరిగినట్లు పోలీసులు

By అంజి  Published on  24 Oct 2021 2:44 AM GMT
బాలికపై అత్యాచారం.. సీసీటీవీలో నిందితుడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 6 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం రంజిత్‌నగర్‌కు చెందిన ఓ 6 ఏళ్ల బాలిక టిఫిన్‌ చేసేందుకు దగ్గర్లోని టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లింది. అయితే కొద్ది సమయం తర్వాత బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది. ఆమెకు రక్తస్రావం జరగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు తెలిపారు.

ఒక్కసారిగా షాక్‌ తిన్న కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఒక దినసరి కూలీ. పిల్లలపై లైంగిక వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. అందులో నిందితుడు కనిపించాడు. నిందితుడి వెనుకాల ఆ బాలిక వెళ్తున్నట్లు ఫుటేజీలో ఉంది. ప్రస్తుతానికైతే ఆ నిందితుడు ఎవరు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే ఢిల్లీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

Next Story
Share it