400 కోట్ల విలువైన డ్రగ్స్.. ఎక్కడ పట్టుకున్నారంటే.?

గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో బోటులో రూ. 400 కోట్ల డ్రగ్స్‌తో వెళ్తున్న ఆరుగురు పాకిస్థానీ పౌరులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  12 March 2024 8:15 PM IST
400 కోట్ల విలువైన డ్రగ్స్.. ఎక్కడ పట్టుకున్నారంటే.?

గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో బోటులో రూ. 400 కోట్ల డ్రగ్స్‌తో వెళ్తున్న ఆరుగురు పాకిస్థానీ పౌరులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు గత రాత్రి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ జాతీయులను పట్టుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ తెలిపిన వివరాల ప్రకారం ఆరుగురు వ్యక్తులు భారత బోటును ఉపయోగించి ఢిల్లీ, పంజాబ్‌లకు నిషేధిత డ్రగ్స్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ATS ఆపరేషన్‌ను అభినందించారు. అధికారులకు రూ.10 లక్షల బహుమతిని ప్రకటించారు. గత 30 రోజుల్లో గుజరాత్‌ తీరంలో పట్టుబడిన రెండో పెద్ద డ్రగ్స్‌ స్మగ్లింగ్ ముఠా. ఫిబ్రవరి 28న గుజరాత్ తీరంలో అనుమానిత పాకిస్థానీ సిబ్బంది ప్రయాణిస్తున్న పడవ నుంచి కనీసం 3,300 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.2,000 కోట్లకు పైగానే ఉంది.

Next Story