ఆరు నెలల ప‌సికందుపై దారుణం

6 Month old Innocent Molested by Neighbour. లక్నోలోని సదత్‌గంజ్ ప్రాంతంలో ఆరు నెలల వయసున్న బాలికను కూడా వదలలేదు కామాంధులు.

By Medi Samrat  Published on  15 Nov 2021 12:59 PM GMT
ఆరు నెలల ప‌సికందుపై దారుణం

లక్నోలోని సదత్‌గంజ్ ప్రాంతంలో ఆరు నెలల వయసున్న బాలికను కూడా వదలలేదు కామాంధులు. ఆరు నెలల వయసున్న బాలికపై అత్యాచారం జరగడంతో.. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ సదత్‌గంజ్ బ్రిజేష్ కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాకు చెందిన ఈ కుటుంబం సదత్‌గంజ్ ప్రాంతంలోని అంబర్‌గంజ్‌లో అద్దెకు నివసిస్తోంది. నిందితుడు బ్యాంగిల్స్ వ్యాపారం చేస్తున్నాడు.

ఆరు నెలల బాలిక తల్లి ఆదివారం రాత్రి వంట చేస్తున్న సమయంలో.. పాప ఏడుపు వినిపించింది. బాలిక ఏడుపు విని పొరుగింట్లో ఉండే సన్నీకుమార్‌ కూడా అక్కడికి వెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ పాప ఏడుస్తూ ఉండడంతో ఆమెను సన్నీ కుమార్ చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమెతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. బిడ్డకు పాలు పట్టిస్తూ తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడని భావిస్తూ ఉన్నారు.

ఆ తర్వాత బాలిక ఏడుపు ఆపకుండా ఉండడంతో కుటుంబం అతడి ఇంటికి వెళ్ళింది.. వెంటనే సన్నీ ఆ చిన్నారిని వదిలి పారిపోయాడు. జనం సన్నీని పట్టుకుని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను పోలీసులు విచారిస్తూ ఉన్నారు.


Next Story
Share it