ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఆరుగురు మృతి, 12 మందికి పైగా తీవ్ర గాయాలు

6 dead, over 12 injured in boiler explosion in factory in Bihar. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నూడిల్స్ తయారీ కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో కనీసం 6 మంది కార్మికులు మరణించారు.

By అంజి  Published on  26 Dec 2021 7:56 AM GMT
ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఆరుగురు మృతి, 12 మందికి పైగా తీవ్ర గాయాలు

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నూడిల్స్ తయారీ కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో కనీసం 6 మంది కార్మికులు మరణించారు. 12 మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారో తెలియరాలేదు. తెలిసిన వివరాల ప్రకారం, పేలుడు చాలా బలంగా ఉంది, పేలుడు జరిగిన ప్రదేశానికి 5-కిమీ దూరంలో వినిపించింది. మంటలను ఆర్పేందుకు కనీసం ఐదు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. పేలుడు ధాటికి పక్కనే ఉన్న సంస్థలు కూడా దెబ్బతిన్నాయని విషయం తెలిసిన అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినప్పుడు పెద్ద చప్పుడు వినిపించిందని చుట్టుపక్కల వారు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాయిలర్‌ పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Next Story
Share it