హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

6 dead, 10 injured in massive fire at Lucknow hotel. లక్నోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని హోటల్ లెవానాలో

By Medi Samrat  Published on  5 Sep 2022 9:12 AM GMT
హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

లక్నోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని హోటల్ లెవానాలో సోమవారం ఉదయం (సెప్టెంబర్ 5) జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేరారు. ఘటనా స్థలంలో మూడు అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హోటల్ లెవానాలో అగ్నిమాపక, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఆక్సిజన్ మాస్క్‌లు ధరించిన భద్రతా సిబ్బంది హోటల్ గదుల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

లక్నో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 15 మందిని రక్షించారు. రక్షించబడిన 15 మందిలో ఇద్దరు స్పృహతప్పి పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు. లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ కొన్ని రోజుల క్రితం హోటల్ లెవానాపై నోటీసు జారీ చేసింది. సిఎంఓ మనోజ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉదయం హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మొత్తం 10 మందిని ఆసుపత్రిలో చేర్చారు, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదనపు డైరెక్టర్ హెల్త్ ఉత్తర ప్రదేశ్, GS బాజ్‌పాయ్ మాట్లాడుతూ, "ఈ ఉదయం లెవానా సూట్స్ హజ్రత్‌గంజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది, ఆ తర్వాత గాయపడ్డ వాలారు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటివరకు, 10 మందిని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు, వారిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు." అని తెలిపారు.

లెవానా హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటు జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి హోటల్ లెవానా గదుల కిటికీ అద్దాలు పగలగొట్టారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం టచ్‌లో ఉందని చెప్పారు. "లక్నోలోని ఒక హోటల్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించిన విషాద సంఘటన గురించి నేను తెలుసుకున్నాను. పరిస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నా కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటుంది. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు.

లక్నో హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత పోలీసు కమిషనరేట్ వారణాసి నుండి హోటల్ యాజమాన్యాలకు ఒక హెచ్చరిక జారీ చేయబడింది. పోలీస్ కమిషనరేట్ వారణాసి నుండి వచ్చిన ఒక ప్రకటనలో, "లక్నో హోటల్ లో అగ్నిప్రమాదం తరువాత.. కమిషనరేట్‌ పరిధి లోని అన్ని హోటళ్లు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు చేయనున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ ఎన్‌ఓసి తనిఖీ చేయబడుతుంది. హోటళ్లు, ఆసుపత్రుల్లో అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేస్తారు. అగ్నిమాపక శాఖ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తుంది." అని తెలిపారు.





Next Story