5 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 12 ఏళ్ల బాలుడు

5-year-old girl raped by 12-year-old boy in Jharkhand. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది..! జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో 12 ఏళ్ల బాలుడు

By Medi Samrat  Published on  30 April 2022 3:06 PM IST
5 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 12 ఏళ్ల బాలుడు

సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది..! జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో 12 ఏళ్ల బాలుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు. బాలిక తన ఇంటికి సమీపంలోని ఓ దుకాణంలో కూల్ డ్రింక్ కొనుగోలు చేసేందుకు వెళ్లగా, అక్కడ ఉన్న బాలుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం తొర్పా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలుడిని పట్టుకుని విచారించగా తన నేరం అంగీకరించాడని పోలీసు సూపరింటెండెంట్ అమన్ కుమార్ తెలిపారు. బాలుడిని రిమాండ్‌పై రాంచీలోని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు.

Next Story