నిర్మానుష్య ప్రాంతంలో ఐదేళ్ల బాలిక మృతదేహం.. 20 మంది అరెస్ట్‌

దక్షిణ గోవాలోని వాస్కో ప్రాంతంలోని నిర్మాణ ప్రదేశం వెనుక ఐదేళ్ల బాలిక మృతదేహం కనుగొన్నారు.

By Medi Samrat  Published on  13 April 2024 7:29 PM IST
నిర్మానుష్య ప్రాంతంలో ఐదేళ్ల బాలిక మృతదేహం.. 20 మంది అరెస్ట్‌

దక్షిణ గోవాలోని వాస్కో ప్రాంతంలోని నిర్మాణ ప్రదేశం వెనుక ఐదేళ్ల బాలిక మృతదేహం కనుగొన్నారు. అయితే ఆమె లైంగిక వేధింపులకు గురైందని.. గొంతు నులిమి చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. నిర్మాణ స్థలంలో దాదాపు 20 మంది కూలీలను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో వెతుకులాట మొదలు పెట్టారు. అయితే శుక్రవారం వడ్డెంలోని సైట్ వెనుక ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్ గోవా) సునీతా సావంత్ పంచుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని నిర్ధారించారు. "బాలిక మృతదేహాన్ని పోలీసు సర్జన్ పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిర్వహించారు. బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించారు." అని సునీతా సావంత్ చెప్పారు. వాస్కో పోలీసులు IPC సెక్షన్లు 376, 302, POCSO చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు

Next Story