ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు బ్రిడ్జి కింద ఉన్న కాలువలో పడడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానిక గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వార్త తెలియగానే స్థానికులు గుమిగూడారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. అయితే కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.
గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హింద్ హోటల్ సమీపంలోని నేషనల్ హైవే-2 పై ఉదయం 6:30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. కారు కల్దీహ్ మోర్ సమీపంలోని వంతెనపై నుండి జారిపడి 100 అడుగుల లోతులో పడిపోయింది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలోని ఘటో నివాసితులని, వారు అసన్సోల్‌కు వెళ్లారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు వ్యక్తులను వసీం అక్రమ్, షకీల్ అక్తర్ లుగా గుర్తించారు