దారుణం : పెళ్లిలో వంట చేసేందుకు పిలిచి.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం
5 men gangrape 2 women in Madhya Pradesh. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలపై మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌కు
By Medi Samrat Published on 19 Nov 2021 12:34 PM GMT
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలపై మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. షియోపూర్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు వంట చేసేందుకు పిలిచి దారుణానికి పాల్పడ్డారు. ఈ మేరకు.. పెళ్లి వేడుకలో భోజనం వండడానికి పిలిచిన ఇందర్ మాలి తమపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఇద్దరు బాధితురాలు గురువారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాహం జరిగే స్థలం వద్దకు చేరుకోగానే తమపై ఇందర్ మాలి, అతని ఇద్దరు సహచరులు నేత్రమ్ మీనా, అక్మల్ మీనా అనే వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు.. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించారు. అనంతరం బాధిత మహిళలు ఇద్దరిని దాదూని అనే మరొక గ్రామానికి తరలించి.. అక్కడ విజేంద్ర సింగ్ అనే వ్యక్తికి అప్పగించారు. అక్కడ విజేంద్ర సింగ్, మరో వ్యక్తి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
జరిగిన ఘటనపై ఎవరితోనూ చెప్పమని హామీ ఇచ్చిన తర్వాతే ఇద్దరు బాధిత మహిళలను అక్కడినుండి వెళ్లేందుకు అనుమతించారు. అక్కడి నుండి బయటపడ్డ బాధితులు పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలకు వైద్య పరీక్షల అనంతరం.. ఐదుగురు నిందితులపై సామూహిక అత్యాచారం, అపహరణ కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.