మైనర్ పిల్లలను విడిచిపెట్టి జిమ్ ట్రైనర్ తో వెళ్లిపోయిన 44 ఏళ్ల మహిళ
44-yr-old woman abandons minor daughters, elopes with gym trainer in TVM. మైనర్ కుమార్తెలను వదిలి ప్రియుడితో కలిసి పారిపోయిన మహిళను వలియమల పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on
22 March 2022 3:00 PM GMT

తిరువనంతపురం : మైనర్ కుమార్తెలను వదిలి ప్రియుడితో కలిసి పారిపోయిన మహిళను వలియమల పోలీసులు అరెస్ట్ చేశారు. నెడుమంగడ్‌కు చెందిన మినీమోల్ (44), ఆమె ప్రేమికుడు కాచాని షైజు (30) లను సోమవారం నాడు అరెస్టు చేశారు. మినిమోల్‌ను పిల్లలను విడిచిపెట్టమని ప్రోత్సహించినందుకు షైజును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్లు, 13 ఏళ్ల బాలికల తల్లి మినిమోల్ గత 5 ఏళ్లుగా జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న షైజూతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
ఇటీవల తన భార్య కనిపించడం లేదని మినిమోల్ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి యువతితో పాటు ఆమె ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. మినిమోల్ భర్త గత 11 ఏళ్లుగా విదేశాల్లో ఉండి కొన్ని రోజుల క్రితం ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 17న కాచానిలోని ఓ ఆడిటోరియంలో మినిమోల్, షైజు వివాహం చేసుకున్నారు. మైనర్ పిల్లలను వదిలి వెళ్లినందుకు వారిపై కేసు నమోదు చేశారు. అరెస్టు అనంతరం పోలీసులు ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు.
Next Story