దొంగ పొట్ట‌లో 25 ఉంగ‌రాలు.. ఏం జ‌రిగిందంటే..

35 grams of gold ornaments recovered from thief's stomach in Karnataka. కర్ణాటక రాష్ట్రంలో ఓ దొంగ భయంతో పోలీసులకు ఆధారాలు దొరకకూడదని

By Medi Samrat  Published on  1 Jun 2021 1:03 PM GMT
దొంగ పొట్ట‌లో 25 ఉంగ‌రాలు.. ఏం జ‌రిగిందంటే..

దొంగ‌లు దొంగ‌త‌నం చేసి.. దొర‌క‌కుండా ఉండ‌టానికి భ‌లే స్కెచ్‌లు వేస్తున్నారు. తాజాగా.. కర్ణాటక రాష్ట్రంలో ఓ దొంగ భయంతో పోలీసులకు ఆధారాలు దొరకకూడదని దాదాపు 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. దీంతో డాక్టర్లు ఆపరేషన్‌ చేసి ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను బయటికి తీశారు. వివ‌రాళ్లోకెళితే.. మార్చి చివర్లో సుళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధి పాత బస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ. 50 వేలు నగదు దోచుకెళ్లారు.

ఈ కేసులో ఐదు రోజుల కిందట తంగచ్చయన్‌ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరు అనుమానితుల‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే దొరికిపోతాననే భయంతో.. శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అతనికి కడుపు నొప్పి రావడంతో పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌రే తీయగా.. కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న, చిన్న ఉంగరాలను తీశారు. ప్రస్తుతం ఆ దొంగ కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.


Next Story