ఈజిప్టులో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. చాలామంది గాయపడ్డారు. వివరాళ్లోకెళితే.. ఈజిప్టులోని సోహగ్ ప్రావిన్స్ దఫల్ అల్ సవమ్, తాహ్త సిటీలకు మధ్య శుక్రవారం రెండు రైళ్లు ఢీ కొనడంతో.. 32 మంది మృతిచెందగా.. 66 మంది తీవ్రగాయాల పాలయ్యారు.
ఈ విషయమై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుని సహాయక చర్యలు చేపట్టారు. కోచ్‌ల మధ్య ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందుకు స్థానిక జనం సహాయపడుతున్నారు. 49 అంబులెన్స్‌ల సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ఇదిలావుంటే.. 2017 ఆగస్టులో కూడా అలెగ్జాండ్రియా సిటీ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది మరణించగా.. 123 మంది గాయపడ్డారు. ఈజిప్టు రైల్వే శాఖ పనితీరు సరిగా లేని కారణంగానే తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.