ముగ్గురు మహిళలు.. ఎంత ఈజీగా బంగారం దోచేశారంటే..!

3 women escape from jewellery shop, arrested. నగల దుకాణాల్లో బంగారు మంగళసూత్రాలను దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాలో దొరికిపోయి

By Medi Samrat  Published on  29 Dec 2021 1:15 PM GMT
ముగ్గురు మహిళలు.. ఎంత ఈజీగా బంగారం దోచేశారంటే..!

నగల దుకాణాల్లో బంగారు మంగళసూత్రాలను దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాలో దొరికిపోయిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు జబల్‌పూర్‌లోని బార్గి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేరస్తుల నుంచి దొంగిలించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల దుకాణంలో నగలు చూస్తామనే నెపంతో మంగళసూత్రాన్ని దొంగిలించారు. ఆ ముగ్గురు మహిళలు పొరుగున ఉన్న నర్సింగపూర్ జిల్లాలోని గోటేగావ్ వాసులు. సమీపంలోని నగరాల్లోని దుకాణాలకు వెళ్లి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసేవారని తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్గి నివాసి విశ్వజిత్ సోనీకి మెయిన్ రోడ్ లో కైలాష్ చంద్ర జ్యువెలర్స్ పేరుతో బంగారం-వెండి దుకాణం ఉంది. డిసెంబరు 20న దుకాణం మూసే సమయంలో తూకం వేయగా ఆభరణాలు బరువు తగ్గాయి.. ఆపై సామాను సరిపోల్చి చూసే సరికి బంగారు మంగళసూత్రం కనిపించలేదు. తన సోదరుడితో కలిసి షాపులోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. షాపులో నగలు చూద్దామనే సాకుతో ముగ్గురు మహిళలు మంగళసూత్రాన్ని దొంగిలిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.

సీసీటీవీ కెమెరాలోని ఫుటేజీలో ఉన్న మహిళల ఛాయాచిత్రాల ద్వారా వెతకడం ప్రారంభించినట్లు బార్గి పోలీసు రితేష్ పాండే తెలిపారు. బార్గీ నగర్‌లో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో వారిని పోలీసులు వెంబడించారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి సీసీటీవీ ఫుటేజీలతో వారి ముఖాలను సరిచూశారు. దొంగతనం చేసిన మహిళలు వాళ్లేనని తెలుసుకున్నారు. విచారణలో ముగ్గురూ కుమ్హారి మొహల్లా గోటేగావ్ జిల్లా నర్సింగ్‌పూర్‌కు చెందిన దుర్గా భడోరియా (45), 23 ఏళ్ల తరుణ భడోరియా, 19 ఏళ్ల పూజ భడోరియా అని తేలింది. చోరీకి గురైన నగలను గోటేగావ్‌లో ఉంచినట్లు నేరస్థులు తెలిపారు.


Next Story