ఖైదీలను ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు.. స్కూటీతో పరార్

3 policemen arrested for helping prisoners escape from jail. ఎస్కార్ట్ డ్యూటీలో నియమించబడిన ముగ్గురు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా

By Medi Samrat  Published on  1 Jun 2022 9:00 PM IST
ఖైదీలను ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు.. స్కూటీతో పరార్

ఎస్కార్ట్ డ్యూటీలో నియమించబడిన ముగ్గురు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా దోపిడీ, అత్యాచార నిందితులు సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులతో సహా ఆరుగురిని గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నిందితులను కోర్టులో హాజరుపరిచి ఒకరోజు రిమాండ్‌కు తరలించారు.

సోమవారం అర్థరాత్రి ఎస్కార్ట్ గార్డ్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ జంగ్ బహదూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు పోలీసులు, పరారీలో ఉన్న నిందితులపై సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం నాడు భోండ్సీ జైలులో ఉన్న కొంతమంది ఖైదీలను చికిత్స కోసం ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అత్యాచార నిందితుడు అభిజీత్, దోపిడీ నిందితుడు రాకేష్‌లను ప్రభుత్వ వాహనంలో హవల్దార్ నిషు, హవల్దార్ అనిల్, కానిస్టేబుల్ నవీన్, ఎస్కార్ట్ డ్యూటీలో నియమించారు. ముగ్గురు పోలీసులు ఇద్దరు నిందితులను సెక్టార్ -56లోని రెడ్ లైట్ దగ్గర ప్రభుత్వ వాహనం నుండి దించి ప్రైవేట్ వాహనంలో ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనంలో ఇద్దరు నిందితులతో పాటు పోలీసులు సెక్టార్-38లోని గ్రీన్-టీ ఓయో హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరు నిందితులు స్కూటీతో పరారయ్యారు.

మంగళవారం, ఝడ్సా గ్రామానికి చెందిన అరవింద్ అలియాస్ అనుప్, ఇద్దరు ఖైదీలకు సహాయం చేసిన నహర్‌పూర్ రూపా నివాసి అజయ్ జఖర్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చక్‌పూర్‌లో నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ నిర్వాహకుడు నితిన్ భరద్వాజ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అరవింద్‌ అలియాస్‌ అనుప్‌, అజయ్‌ జాఖర్‌ స్కూటీపై వచ్చినట్లు నిందితులు వెల్లడించారు. అదే స్కూటీ ను ఉపయోగించి ఖైదీలు పారిపోయారు.














Next Story