నిర్మల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

3 Persons dies in road accident in nirmal's kadem. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది.

By అంజి  Published on  19 Jan 2022 4:11 PM IST
నిర్మల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదానికి కారణం.. ఆటో అతి వేగంగా వెల్లడమేనని ప్రాథమిక సమాచారం. ఈ ఘటన కడెం మండలం బెల్లాల్‌ దగ్గర బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కడెం నుండి బెల్లాల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

అదుపు తప్పిన ఆటో.. రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు మల్లన్నపేటకు చెందిన మల్లయ్య (55), అన్నాపూర్‌ గ్రామానికి చెందిన శంకరవ్వ (52), సీమల శాంత (55)గా పోలీసులు గుర్తించారు.

Next Story