ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని చంపేసి.. రాత్రికి రాత్రే నదీ తీరంలో పాతి పెట్టారు

3 people of same family were put to death. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని చంపేశారు. అంతేకాకుండా వారిని నదీ తీరంలో పాతి పెట్టారు

By Medi Samrat  Published on  14 Nov 2021 2:22 PM GMT
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని చంపేసి.. రాత్రికి రాత్రే నదీ తీరంలో పాతి పెట్టారు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని చంపేశారు. అంతేకాకుండా వారిని నదీ తీరంలో పాతి పెట్టారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బంద్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోద్నేర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత మృతదేహాలను రాత్రికి రాత్రే కోయెల్ కరో నది ఘాట్‌లో పూడ్చిపెట్టారు. బాండ్‌గావ్ పోలీసులు బుధవారం నాడు నిందితులని కనిపెట్టే క్రమంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చక్రధర్‌పూర్‌కు పంపినట్లు ఇన్‌ఛార్జ్ డివిజనల్ అధికారి దిలీప్ ఖల్ఖో తెలిపారు.

మృతుల్లో సేలం దంగా (40), అతని భార్య బెలాని దంగా (40), అతని 13 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. సేలంకు ఉన్న మిగిలిన ఇద్దరు కుమార్తెలు.. తమ అత్త ఇంటికి వెళ్లడంతో వారి ప్రాణాలు నిలబడ్డాయి. ఇంట్లో ఉన్న ముగ్గురినీ కత్తులతో గొంతు కోసి హత్య చేశారని తెలుస్తోంది. గత ఆదివారం సాయంత్రం నుంచి ముగ్గురు కనిపించకుండా పోయారని బాధితుల బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే గ్రామానికి చెందిన మార్క్స్ దంగా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి దూరపు బంధువు అగస్టిన్ హోరో మాట్లాడుతూ.. మృతుడి ఇద్దరు కుమార్తెలు తమ అత్త ఇంటికి వెళ్లారని, దీంతో వారు ప్రాణాలను కాపాడుకోగలిగారని పోలీసు అధికారి తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. పరస్పర శత్రుత్వమే హత్యకు కారణమని ప్రాథమికంగా దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.


Next Story
Share it