కాన్వెంట్ హాస్టల్‌లోకి చొరబడి.. మైన‌ర్ బాలిక‌లకు మ‌ద్యం తాగించి లైంగిక వేధింపులు

3 held for sexually abusing minor girls in convent hostel in Kerala. కాన్వెంట్ హాస్టల్‌లో ముగ్గురు మైనర్ బాలికలను లైంగికంగా వేధించినందుకు

By Medi Samrat
Published on : 26 Aug 2022 6:14 PM IST

కాన్వెంట్ హాస్టల్‌లోకి చొరబడి.. మైన‌ర్ బాలిక‌లకు మ‌ద్యం తాగించి లైంగిక వేధింపులు

కాన్వెంట్ హాస్టల్‌లో ముగ్గురు మైనర్ బాలికలను లైంగికంగా వేధించినందుకు కేరళలోని తిరువనంతపురంలోని వలియతుర ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాలికలు బస చేసిన గదుల్లోకి ప్రవేశించేందుకు నిందితులు కాంపౌండ్ వాల్ పై నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. లైంగికంగా వేధించే ముందు బాలికలకు మద్యం తాగించారు. నిందితులు మెర్సన్, అరుణ్, రెంజిత్‌లను కడినంకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అభియోగాలు మోపారు.

ఆగస్ట్ 24వ తేదీ బుధవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు కాన్వెంట్ హాస్టల్‌లోకి చొరబడడాన్ని గమనించారు పోలీసులు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం వెలుగులోకి వచ్చింది. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరికొంత మంది ప్రమేయం ఉండే అవకాశం ఉందని అధికారులు ఆరా తీస్తున్నారు.

నిందితుల్లో ఒకరు కాన్వెంట్ లోని బాలికలకు స్నేహితుడని పోలీసులు తెలిపారు. రహస్యంగా కాన్వెంట్ హాస్టల్‌లో కలుసుకొనేవారు. ఆ తర్వాత అతను తన ఇద్దరు స్నేహితులను హాస్టల్‌కు తీసుకువచ్చాడు. పురుషులు మొదట్లో అమ్మాయిలతో స్నేహం చేశారు. ఆ తర్వాత హాస్టల్‌కు మద్యం తీసుకొచ్చి బాలికలను తాగించి లైంగికంగా వేధించారు. కాన్వెంట్‌లోకి ప్రవేశించేందుకు వీళ్లకు ఎవరైనా సహాయం అందించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story