విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోటోషూట్ కోసం వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని హుకుంపేట సమీపంలో జరిగింది. పెళ్లి ఫోటోషూట్ కోసం వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఊబిలో చిక్కుకొని మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిని మోరి నిరంజన్(18), బాకురు వినోద్ కుమార్(25), తమరబ శివనాగేంద్ర కుమార్ లుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.