ఫ్లాట్‌లో మూడు మృతదేహాలు.. తండ్రి మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌..

3 bodies found at flat in Vasant Vihar. వసంత్ విహార్‌లోని ఓ ఫ్లాట్‌లో శనివారం నాడు ఢిల్లీ పోలీసులు మూడు మృతదేహాలను కనుగొన్నారు.

By Medi Samrat  Published on  22 May 2022 8:51 AM GMT
ఫ్లాట్‌లో మూడు మృతదేహాలు.. తండ్రి మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌..

న్యూఢిల్లీ: వసంత్ విహార్‌లోని ఓ ఫ్లాట్‌లో శనివారం నాడు ఢిల్లీ పోలీసులు మూడు మృతదేహాలను కనుగొన్నారు. ఇది సామూహిక ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్లాట్ లోపలి నుండి తాళం వేసి ఉంది. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, గ్యాస్ సిలిండర్ స్మెల్ కూడా వస్తూ ఉంది. ఇంట్లో సూసైడ్ నోట్ కూడా లభించింది. మంజు (తల్లి), అన్షిక, అంకు (కుమార్తెలు) ఇంట్లో నివసించేవారు. ఏప్రిల్ 2021లో ఇంటి యజమాని (వారి తండ్రి) మరణం కారణంగా కుటుంబం తీవ్ర నిరాశలో ఉండిపోయింది. అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.55 గంటలకు, వసంత్ విహార్ ప్రాంతంలోని వసంత్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నంబర్ 207 లోపలి నుండి తాళం వేసి ఉంది. చాలా స‌మ‌యం పాటు ఇంట్లో నుంచి క‌ద‌లిక‌లు, స్పంద‌న లేక‌పోవ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఆ ప్లాట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. తలుపులు తెరిచి లోప‌లికి ప్ర‌వేశించారు. ఆ ప‌రిస‌రాల‌ను గ‌మ‌నించగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పాక్షికంగా తెరిచి ఉండ‌టంతో పాటు సూసైడ్ నోట్ కూడా ల‌భించింది.

లోపలి గదిలో వెతకగా మూడు మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. ఆ గ‌దిలోనే మూడు చిన్న అంగితి (బొగ్గుల కుంపటి లాంటి ప‌రిక‌రం)లను గదిలో ఉంచారు. అందులో మంట పెట్టి ఉంచిన‌ట్టు గుర్తించారు. ప్రతి వైపు నుండి అన్ని తలుపులు మరియు కిటికీలు మూసివేయబడ్డాయి. లోపలి గదిని తనిఖీ చేసినప్పుడు మంచం మీద మూడు మృతదేహాలు పడి ఉన్నాయి. మూడు చిన్న కుంపట్లు కూడా ఉన్నాయి. ఊపిరాడక మృతి చెంది ఉంటారని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది. పొగ పీల్చి ముగ్గురు మృతి చెంది ఉంటార‌ని నైరుతి ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ సి తెలిపారు.

Next Story
Share it