గర్ల్ ఫ్రెండ్ తనను పట్టించుకోలేదని ఆమెను కత్తితో పొడిచి చంపిన 29 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని భరత్‌గా గుర్తించారు, అతడు వృత్తిరీత్యా డ్రైవర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితురాలు ఆర్తితో తనకు వివాహేతర సంబంధం ఉందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఆర్తి తనను ఇటీవల నిర్లక్ష్యం చేయడంతో ఇది నిందితుడికి కోపం తెప్పించింది. అతను ఆమెను చంపడానికి కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 21న, సాగర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ పార్క్, సాగర్‌పూర్ సమీపంలో ఒక మహిళ కత్తిపోట్లకు గురైనట్లు పోలీసులకు పిసిఆర్ కాల్ వచ్చింది. జగదాంబ విహార్మ్‌కు చెందిన బాధితురాలు ఆర్తి (28)కి తీవ్రగాయాలు కాగా, ఆమెను డిడియు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసుల తదుపరి విచారణలో తేలింది. అయితే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆర్తి భర్త శంకర్ కుమార్ సాగర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో హత్య కేసు నమోదు చేశారు. మహిళను హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాల సమన్వయంతో నిందితుడిని అరెస్టు చేశారు. హత్య చేసిన సమయంలో ధరించిన బట్టలు.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.