రాత్రి యువతి వాకింగ్‌ చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన దుండుగుడు ప్రైవేట్‌ భాగాలను చూపిస్తూ..

28-year-old woman molested in Bhopal. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వాకింగ్‌ చేస్తున్న యువతిని ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు.

By అంజి  Published on  22 Nov 2021 3:15 PM IST
రాత్రి యువతి వాకింగ్‌ చేస్తుండగా..  బైక్‌పై వచ్చిన దుండుగుడు ప్రైవేట్‌ భాగాలను చూపిస్తూ..

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వాకింగ్‌ చేస్తున్న యువతిని ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కమలానగర్‌ ప్రాంతంలో 28 ఏళ్ల యువతి తన సోదరితో కలిసి ఇంటి బయట వాకింగ్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే ఓ దుండగుడు బైక్‌పై వారి వద్దకు బైక్‌ దూసుకొచ్చాడు. ఆ వెంటనే ఆగి తన ప్రైవేట్‌ భాగాలను యువతికి చూపెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. అదే సమయంలో యువతి అతడి బైక్‌ నెంబర్‌ నోట్‌ చేసుకుంది. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేసిన కమలా నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

"శుక్రవారం రాత్రి 10.15 గంటల సమయంలో, ఆమె తన సోదరితో కలిసి తన ఇంటి వెలుపల వాకింగ్‌ చేస్తోంది. అకస్మాత్తుగా, బైక్‌పై వచ్చిన నిందితుడు వారి ముందు ఆపి అతని ప్రైవేట్ భాగాలను ఫ్లాష్ చేశాడు" అని ఆమె పోలీసులకు తెలిపింది. యువతులు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయారు. అయితే, అతని బైక్ నంబర్ ప్లేట్ వివరాలను ఆమె నోట్ చేసుకోగలిగింది. యువతి ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సంబంధిత సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Next Story