విషాదం : గీజర్ నుండి వెలువ‌డిన‌ గ్యాస్ పీల్చిన యువకుడు.. త‌ర్వాత ఏమైందంటే..

27-year-old dies after ‘inhaling gas’ from geyser at Gurgaon hotel. గుర్గావ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌రూమ్‌లో 27 ఏళ్ల యువకుడు శవమై కనిపించాడు.

By Medi Samrat  Published on  22 Feb 2022 1:25 PM GMT
విషాదం : గీజర్ నుండి వెలువ‌డిన‌ గ్యాస్ పీల్చిన యువకుడు.. త‌ర్వాత ఏమైందంటే..

గుర్గావ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌రూమ్‌లో 27 ఏళ్ల యువకుడు శవమై కనిపించాడు. హోటల్‌లోని బాత్‌రూమ్‌లోని గీజర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే అతడు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి అంబాలాలోని జాండ్లీకి చెందిన సత్దేవ్ ధిమాన్‌గా గుర్తించారు. ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. శనివారం సదర్ బజార్ సమీపంలోని ఓ హోటల్‌లో ధీమాన్, అతని స్నేహితులు కొందరు చెక్ ఇన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఆరుగురు ఫిబ్రవరి 14న అంబాలా నుంచి డెహ్రాడూన్‌కు వెళ్లారని, ముస్సోరి, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, రిషికేశ్, హరిద్వార్, ఢిల్లీలను సందర్శించిన తర్వాత తాము ఫిబ్రవరి 19న గుర్గావ్‌లోని హోటల్ రూమ్ లోకి చెకిన్ చేశామని బాధితుడి స్నేహితుడు పంకజ్ కుమార్ పోలీసు ఫిర్యాదులో తెలిపారు.

"సాయంత్రం మేము ఒక మాల్‌కి వెళ్ళాము, ఆ తర్వాత కొంతమంది స్నేహితులు వారి వారి ప్రదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. మేము నలుగురం హోటల్‌లో రెండు గదులను తీసుకున్నాము. మరుసటి రోజు ఉదయం, సత్దేవ్ స్నానం చేయడానికి వెళ్ళాడు. 20-25 నిమిషాల తర్వాత అతను బయటకు రాకపోవడంతో, మేము బాత్రూమ్ తలుపు తట్టాము, కానీ సమాధానం లేదు, "అని కుమార్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. హోటల్ మేనేజర్‌కి ఫోన్ చేసి తలుపులు తీయడానికి ప్రయత్నించామని చెప్పారు. విరిగిన వెంటిలేటర్ షాఫ్ట్ ద్వారా అతను పొగతో నిండిన బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని గుర్తించారు. తలుపులు పగలగొట్టి వెంటనే ఆస్పత్రికి తరలించారు. హోటల్ మేనేజర్, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ పీల్చి చనిపోయాడని స్నేహితులు ఆరోపించారు.


Next Story
Share it