ఐటీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

26-year-old woman allegedly gang-raped in Jharkhand. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై గురువారం సాయంత్రం జార్ఖండ్‌లోని

By Medi Samrat  Published on  22 Oct 2022 10:11 AM GMT
ఐటీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై గురువారం సాయంత్రం జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసా ప్రాంతంలో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొందరు వ్యక్తులు ఆమె తన స్నేహితుడితో కలిసి ఉండడాన్ని గమనించి ఈ దారుణానికి పాల్పడ్డారు. "ఆ మహిళ బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితుడికి అమ్మాయి తెలిసి ఉండే అవకాశం ఉంది, మేము మా విచారణను చేస్తున్నాం "అని వెస్ట్ సింగ్‌భూమ్ పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ తెలిపారు. నిందితులు మహిళ స్నేహితురాలిని కొట్టి, ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె ఫోన్‌తో సహా వస్తువులను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. మహిళ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story