రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎన్‌సీఆర్‌లోని గురుగ్రాంకు చెందిన 23 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. తన స్నేహితురాలను కలిసేందుకు బాధితురాలు జైపూర్ వచ్చింది. రెండు రోజుల పాటు స్నేహితురాలితో ఉంది. ఆదివారం నాడు యువతి స్నేహితురాలి ప్రియుడు కూడా జైపూర్ వచ్చాడు. ఆ తర్వాత స్నేహితురాలి ప్రియుడితో కలిసి బాధితురాలు కలిసి దౌసాకు వెళ్లింది. అక్కడ ఆ యువకుడు మరో ఇద్దరితో కలిసి యువతికి మద్యం తాగించాడు.
ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిపై మరొక వ్యక్తి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతిని నిందితులు కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువతి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఘటనా స్థలికి తీసుకెళ్లారు. ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ బెనివల్ పేర్కొన్నారు.