రూమ్ మేట్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. తీరా వెళ్లి చూస్తే..!

23-year-old engineer shoots self dead in Noida. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని ఫేజ్-3 ప్రాంతంలో బుధవారం ఓ ఇంజనీర్

By Medi Samrat
Published on : 18 Feb 2022 2:29 PM IST

రూమ్ మేట్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. తీరా వెళ్లి చూస్తే..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని ఫేజ్-3 ప్రాంతంలో బుధవారం ఓ ఇంజనీర్ కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అలీగఢ్ జిల్లాకు చెందిన రాహుల్ గా గుర్తించారు. అతడి వయసు 23 సంవత్సరాలు. రాహుల్ స్నేహితుడు వివేక్ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు ఎన్డీటీవీ తెలిపింది. వివేక్ రాహుల్‌కు పదేపదే ఫోన్ చేసినా అతను ఫోన్ ఎత్తలేదు. వివేక్ తన గదికి చేరుకుని చనిపోయాడని స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ వివేక్ త్రివేది తెలిపారు.

ఫోరెన్సిక్, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆత్మ హత్య చేసుకోడానికి ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విచారణలో రాహుల్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడని మృతుడి తండ్రి దేవేంద్ర పోలీసులకు తెలిపాడు. యువకుడు అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు ఓ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాహుల్ కు ఆ తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


Next Story