దారుణం.. అసహజ శృంగారాన్ని తిరస్కరించిన.. మైనర్‌ బాలుడిని చంపిన యువకుడు

20-yr-old man kills boy for refusing to have unnatural sex. దేశంలో రోజు రోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన మానవమృగాలు.. మహిళలు, చిన్నారులు,

By అంజి  Published on  26 Jan 2022 10:36 AM IST
దారుణం.. అసహజ శృంగారాన్ని తిరస్కరించిన.. మైనర్‌ బాలుడిని చంపిన యువకుడు

దేశంలో రోజు రోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన మానవమృగాలు.. మహిళలు, చిన్నారులు, బాలురు, చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో అసహజ శృంగారంలో పాల్గొనాలని ఓ మైనర్‌ బాలుడిపై ఒత్తిడి చేశాడు. నిరాకరించినందుకు మైనర్ బాలుడిని 20 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి చంపాడు. పంకజ్ విశ్వకర్మ అనే నిందితుడు సోమవారం బీజభట్ట మురుమ్ గని సమీపంలోని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో బాలుడిని హత్య చేశాడు. ఈ ఘటన బెమెతారా జిల్లా పరిధిలో జరిగింది.

బాలుడిని మచ్చిక చేసుకుని, అసభ్యకరమైన వీడియోల చూపించి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. బాలుడు అసహజ శృంగారానికి అభ్యంతరం తెలపడంతో.. బాలుడిపై కోపం పెంచుకున్న నిందితుడు హత్య చేశాడు. నిర్మానుష్య ప్రదేశంలో బాలుడిని కత్తిపొడిచి చంపేశాడు. నేరం చేసిన వెంటనే అతను అక్కడి నుండి పారిపోయాడని బెమెతర పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్ ప్రకాష్ అవధియా మంగళవారం తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయడంతో నిందితుడు విశ్వకర్మ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story