దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతిపై దుండుగులు అఘాయిత్యానికి తెగబడి ఆపై హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కుర్లాలో గల హెచ్‌డీఐఎల్‌ కాలనీలో ఖాళీగా ఉన్న ఓ భవనంపైన ఉన్న లిఫ్ట్‌ రూమ్‌లో ఓ యువతి మృతదేహం దొరికింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. యువతి తలపై బలమైన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆమె అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తెలిసింది.

గురువారం సాయంత్రం కొందరు యువకులు ఇన్‌స్టాగ్రామ్ కోసం వీడియో షూట్‌ కోసం ఖాళీ భవనంపైకి వెళ్లారు. అక్కడే వారికి యువతి మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులు విషయం చెప్పారని డీసీపీ ప్రణయ్‌ అశోక్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అలాగే బాధిత యువతిని ఇంకా గుర్తించలేదన్నారు. వైద్యుల నివేదిక మేరకు పోలీసులు అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల పోలీసు స్టేషన్లలో యువతి అదృశ్యమైనట్లు ఏవైనా కేసులు ఉన్నాయా అని కూడా పోలీసులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే, ముంబైలో శక్తిమిల్ కాంపౌండ్ రేప్ మరియు హత్య కేసులో నిందితులకు మరణశిక్ష విధించకుండా జీవిత ఖైదు విధించబడింది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story