కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదం.. రెండేళ్ల బాలిక మృతి
2-Year-Old Delhi Girl Killed As Man Reversed His Car. దేశ రాజధాని ఢిల్లీలో కారు రివర్స్ చేస్తుండగా.. రెండేళ్ల బాలిక మృతి చెందింది.
By Medi Samrat Published on 9 Oct 2022 6:55 PM IST
దేశ రాజధాని ఢిల్లీలో కారు రివర్స్ చేస్తుండగా.. రెండేళ్ల బాలిక మృతి చెందింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి ఇంటి బయట రోడ్డుపై ఆడుకుంటోందని పోలీసులు తెలిపారు. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఒకరు ఆమెను ఢీకొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత నెల, ఈశాన్య ఢిల్లీలో రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.