Viral Video : బైక్‌పై వెళుతున్న మ‌హిళ‌ను సినిమాలో మాదిరి వెంబ‌డించి వేధించారు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు స్కూటర్ నడుపుతున్న ఒక మహిళను వేధిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది

By Medi Samrat  Published on  19 Aug 2024 9:45 PM IST
Viral Video : బైక్‌పై వెళుతున్న మ‌హిళ‌ను సినిమాలో మాదిరి వెంబ‌డించి వేధించారు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు స్కూటర్ నడుపుతున్న ఒక మహిళను వేధిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. అందరూ చూస్తుండగానే.. రోడ్డు మీద ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో చాలా మంది ఈ చర్యను ఖండించారు. స్కూటర్ నడుపుతున్న మహిళను వేధించకుండా అడ్డుకోవ‌డానికి ఇతర ప్రయాణికులెవరూ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఒక బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ఉండగా.. మరో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఈ సంఘటన రాత్రి సమయంలో జరిగింది. స్త్రీ రోడ్డు మధ్యలో బైక్ ను రైడ్ చేస్తూ కనిపిస్తుండగా.. బైక్‌ల‌పై ఉన్న వ్య‌క్తులు ఆమెను రెండు వైపుల నుంచి అడ్డగించారు. వారిలో ఒకరు ఆమెను వెనుక నుంచి తాకేందుకు ప్రయత్నించగా.. మరొకరు ఆమెను తోసేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తులు ఆమెను చాలా కిలోమీటర్లు అనుసరించారని నివేదికలు తెలిపాయి. మహిళ ట్రాఫిక్ పోలీసును గుర్తించగా.. అతను రెండు మోటార్‌సైకిళ్లను ఆపి, ఆమెను రక్షించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు వివ‌రాలు వెల్ల‌డించాల్సివుంది.

Next Story