కలెక్షన్ ఏజెంట్ నుండి 18 లక్షలు లాక్కెళ్లారు.. దొంగతనం ఎలా ప్లాన్ చేశారంటే..

18 lakhs looted from collection agent openly. బీహార్‌లోని మధుబనిలో కొందరు కేటుగాళ్లు కలెక్షన్ ఏజెంట్ నుంచి రూ.18 లక్షలు

By Medi Samrat  Published on  16 April 2022 11:45 AM GMT
కలెక్షన్ ఏజెంట్ నుండి 18 లక్షలు లాక్కెళ్లారు.. దొంగతనం ఎలా ప్లాన్ చేశారంటే..

బీహార్‌లోని మధుబనిలో కొందరు కేటుగాళ్లు కలెక్షన్ ఏజెంట్ నుంచి రూ.18 లక్షలు దోచుకున్నారు. బాన్‌భాగ్ వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. పూర్నియా గులాబ్‌బాగ్‌కు చెందిన హోల్‌సేలర్, కలెక్షన్ ఏజెంట్ ధనంజయ్ కుమార్ దాస్ నగదుతో పూర్నియాకు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెరుపుదాడి చేసిన ఇద్దరు దొంగలు బాన్‌భాగ్‌ సమీపంలో ధనంజయ్ కుమార్ దాస్ ను అడ్డుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ధనంజయ్‌కి పిస్టల్‌ చూపించి డబ్బు ఉన్న బ్యాగును లాక్కెళ్లారు. ఆ తర్వాత నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు ధనంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

పిస్టల్ చూపించి 5000 దొంగతనం :

హర్యానాలోని భివానీలో, ఇద్దరు మోటారుసైకిల్ నేరస్థులు కిరాణా దుకాణంలోకి ప్రవేశించి, దుకాణ యజమాని నుండి రూ. 5000 లాక్కెళ్లారు. ఈ ఘటన దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. బాధిత దుకాణదారుడి ఫిర్యాదు మేరకు లోహారు పోలీస్ స్టేషన్ లో నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వ్యాపారవేత్త సంజయ్ మాట్లాడుతూ, ఇద్దరు అబ్బాయిలు మోటార్‌సైకిల్‌పై తన దుకాణానికి వచ్చారని, వారిలో ఒకరు హెల్మెట్ ధరించి ఉన్నారని, మరొకరు టవల్‌తో ముఖాన్ని కప్పుకున్నారని చెప్పారు. వారిద్దరూ పిస్టల్‌ చూపించి డబ్బు డిమాండ్ చేశారు. దుకాణదారుని దుకాణం వెనుకకు తీసుకెళ్లి అతడి జేబులో నుండి రూ. 5000 తీసుకున్నారు. ఈ దోపిడీ చేసిన తర్వాత ఆ ఇద్దరూ భివానీ వైపు పారిపోయారు.












Next Story