డీ-అడిక్షన్ సెంటర్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం

17-years-old minor rapped in de-addiction centre. యూపీలోని నోయిడాలోని డీ-అడిక్షన్ సెంటర్‌లో 17 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన

By Medi Samrat  Published on  3 April 2022 3:28 PM IST
డీ-అడిక్షన్ సెంటర్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం

యూపీలోని నోయిడాలోని డీ-అడిక్షన్ సెంటర్‌లో 17 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన ప్రదీప్ సింగ్.. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గద్వాల్ నివాసి. 44 ఏళ్ల ప్రదీప్ నోయిడాలోని సెక్టార్-108లోని రీ-అవేకనింగ్ వెల్నెస్ ఫౌండేషన్‌లో గార్డుగా పనిచేస్తున్నాడు. బాధితురాలు డ్రగ్స్‌కు బానిసవ్వగా.. అందులో నుండి బయటపడేందుకు బాధితురాలి తల్లిదండ్రులు డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించారు. ఆగస్ట్ 30, 2021న ప్రదీప్ సింగ్ ప్రదీప్ బాలికపై అత్యాచారం చేశాడు. అదే సమయంలో ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు.

ఆ తర్వాత బాధితురాలు డీ అడిక్షన్‌ సెంటర్‌ నుంచి ఇంటికి వెళ్లగా, జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఆ తర్వాత బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సెక్టార్-39 పోలీస్ స్టేషన్‌కు పంపారు. నిందితుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో అత్యాచారం, చంపుతామని బెదిరించడంతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

అదే సమయంలో మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో మైనర్ బాలికపై కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్‌పై కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రకాష్ భోజ్కర్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాధితురాలిని బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మైనర్ బాధితురాలు గర్భం దాల్చడంతో నిందితుడి తల్లిదండ్రులు బాధితురాలిని బేతుల్‌లోని కరుణా ఆస్పత్రికి తీసుకొచ్చి మార్చి 22న అబార్షన్ చేయించారు.అదే విషయంపై గుర్తు తెలియని వ్యక్తి బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్‌కు ఫోన్ చేసి వాంగ్మూలం ఇచ్చారు. ఎస్పీ పోలీసు బృందాన్ని బాధితురాలి ఇంటికి పంపించారు. అన్ని సాక్ష్యాలను సేకరించారు. మార్చి 26న అమలా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై సెక్షన్ 376 కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.













Next Story