Hyderabad : పవిత్ర ప్రాణాలు తీసిన మేనమామ

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిని ఆమె తల్లి కళ్లెదుటే గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు.

By -  Medi Samrat
Published on : 8 Dec 2025 8:13 PM IST

Hyderabad : పవిత్ర ప్రాణాలు తీసిన మేనమామ

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిని ఆమె తల్లి కళ్లెదుటే గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో ఈ దారుణం జరిగింది. మృతురాలిని పవిత్రగా గుర్తించారు. పవిత్రకు ఉమాశంకర్‌ వరుసకు మేనమామ అవుతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. అయితే, ఉమాశంకర్ మద్యానికి బానిస అనే కారణంతో ఆమె అతడితో పెళ్లికి నిరాకరించింది. ఉమాశంకర్ పవిత్రపై కోపం పెంచుకున్నాడు. పవిత్రతో మాట్లాడుతూనే, అకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

కూతురిని కాపాడుకునేందుకు తల్లి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హత్య చేసిన వెంటనే నిందితుడు ఉమాశంకర్, తన కత్తిని, మొబైల్ ఫోన్‌ను ఘటనాస్థలంలోనే వదిలేసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story