యూట్యూబ్ వీడియో చూసి అబార్షన్‌కు ప్రయత్నించిన 17 ఏళ్ల బాలిక

17-year-old girl tried abortion after watching Youtube video. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ మైనర్ బాలిక యూట్యూబ్‌లో అబార్షన్‌ చేసుకునేందుకు ప్రయత్నించింది

By Medi Samrat  Published on  5 April 2022 6:13 PM IST
యూట్యూబ్ వీడియో చూసి అబార్షన్‌కు ప్రయత్నించిన 17 ఏళ్ల బాలిక

నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ మైనర్ బాలిక యూట్యూబ్‌లో అబార్షన్‌ చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత బాలిక పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి వయస్సు కేవలం 17 సంవత్సరాలు, ఆమె ప్రియుడి వయస్సు 27 సంవత్సరాలు. వారి మధ్య ఉన్న సంబంధం కారణంగా బాలిక గర్భం దాల్చింది. భయంతో, ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

కానీ ఆమె యూట్యూబ్‌లో గర్భస్రావం చేయడానికి మార్గం వెతుకుతోంది. కొన్ని చిట్కాలను తెలుసుకుని ఇంట్లోనే కషాయం చేసి తాగింది. కొంత సమయం తర్వాత ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కుటుంబ సభ్యులకు ఆమె గర్భవతి అని తెలిసింది.

మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు 27 ఏళ్ల నిందితుడు సునీల్ మానేపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు నాగ్‌పూర్ డీసీపీ లోహిత్ మతానీ తెలిపారు. సునీల్ మానే కోసం పోలీసులు వెతుకుతున్నారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.













Next Story