రెండేళ్లుగా కన్న కూతురిపై తండ్రి, సోదరుడు అత్యాచారం.. చెల్లిని కూడా ఏమైనా చేస్తారేమోనని..

16-year-old Mumbai girl sexual assault by father, brother for over 2 years.. గత రెండేళ్లుగా తన తండ్రి, అన్నయ్య తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ముంబైలోని 16 ఏళ్ల బాలిక

By అంజి  Published on  21 Jan 2022 1:25 PM IST
రెండేళ్లుగా కన్న కూతురిపై తండ్రి, సోదరుడు అత్యాచారం.. చెల్లిని కూడా ఏమైనా చేస్తారేమోనని..

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగు చూసింది. గత రెండేళ్లుగా తన తండ్రి, అన్నయ్య తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ముంబైలోని 16 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారని ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. 10వ తరగతి చదువుతున్న బాలిక తన స్కూల్‌ టీచర్‌, ప్రిన్సిపాల్‌కు తన బాధను చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. పాఠశాల అధికారులు ఒక ఎన్‌జీవోని సంప్రదించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

2019 జనవరిలో ఒంటరిగా నిద్రిస్తున్న తన 43 ఏళ్ల తండ్రి తనను మొదటిసారిగా లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. అదే నెలలో ఆమె 20 ఏళ్ల సోదరుడు కూడా ఆమెను వేధించాడు. తన తండ్రి, సోదరుడు తన చెల్లెలిని కూడా లైంగికంగా వేధిస్తారని భయపడుతున్నానని, అందుకే తన కష్టాలను తన గురువుకు తెలియజేయాలని నిర్ణయించుకున్నానని బాధితురాలు చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు భారత శిక్షాస్మృతి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరారోపణలను అంగీకరించారు, తరువాత వారిని అరెస్టు చేశారు. కేసు తదుపరి విచారణ సాగుతోంది.

Next Story