-బీహార్ రాష్ట్రంలో వర్షాలకు ప్రజలు భయపడుతూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో పిడుగుల కారణంగా జనం బెంబేలెత్తిపోతూ ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం, మంగళవారం బీహార్ అంతటా పిడుగుల కారణంగా 16 మంది మరణించారు. తూర్పు చంపారన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్.. సరన్‌లలో ముగ్గురు చొప్పున మరణించారు. పశ్చిమ చంపారన్, అరారియా, బంకా, ముజఫర్‌పూర్ ప్రాంతాల్లో కూడా మరణాలు సంభవించాయి.
ఈ మరణాల పట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన ఆదేశాలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. జూన్ 20న రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు 17 మంది చనిపోయారు.