15 సంవత్సరాల బాలికపై కార్ లో గ్యాంగ్ రేప్

15-year-old girl kidnapped, gang-raped by 5 men. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో 15 ఏళ్ల బాలికను కారులో ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు

By Medi Samrat  Published on  13 May 2022 8:00 PM IST
15 సంవత్సరాల బాలికపై కార్ లో గ్యాంగ్ రేప్

జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో 15 ఏళ్ల బాలికను కారులో ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు. బుధవారం రాత్రి నిందితులు తనను బలవంతంగా ధుర్వలోని రింగ్‌ రోడ్డు నుంచి కారులోకి ఎక్కించారని బాలిక పోలీసులకు చెప్పిందని పోలీసులు మీడియాకు తెలిపారు. రాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని దలాదాలి దగ్గరలోని రెస్టారెంట్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కారును పోలీసుల పెట్రోలింగ్ బృందం గుర్తించిందని పోలీసు సూపరింటెండెంట్ (రాంచీ-రూరల్) నౌషాద్ ఆలం పిటిఐకి తెలిపారు.

అనుమానంతో సిబ్బంది కారును తనిఖీ చేయగా ఐదుగురు పురుషులతో పాటు ఏడుస్తున్న బాలిక కనిపించిందని తెలిపారు. 20 ఏళ్ల వయసున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. బాలికను వైద్య పరీక్షల అనంతరం ఇంటికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని వారు తెలిపారు.










Next Story