ఫ్యాక్టరీ లిఫ్ట్‌లో ఇరుక్కుని 15 ఏళ్ల బాలుడు మృతి
15-year-old gets stuck between lift shaft and elevator inside Delhi factory. ఢిల్లీలో 15 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు జారి ఫ్యాక్టరీ రెండో అంతస్తులో ఉన్న
By Medi Samrat Published on 13 Feb 2023 4:19 AM GMTఢిల్లీలో 15 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు జారి ఫ్యాక్టరీ రెండో అంతస్తులో ఉన్న ఎలివేటర్ షాఫ్ట్‌లో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ నుండి లిఫ్ట్ పైకి రాగానే బాలుడు నుజ్జునుజ్జు అయ్యాడని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. బాలుడిని అలోక్‌గా గుర్తించారు. బాలుడి తల్లి ఎయిర్ కూలర్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది.
ఢిల్లీలోని బవానా ఇండస్ట్రియల్ ఏరియాలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. లిఫ్ట్ దగ్గర పని చేస్తున్న బాలుడు ప్రమాదవశాత్తు జారిపడి రెండో అంతస్తులోని షాఫ్ట్‌లో చిక్కుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ పైకి రాగానే నుజ్జునుజ్జు అయ్యాడు. అతని మృతదేహం వైర్లకు వేలాడుతూ కనిపించింది.
ఇది మెకానికల్ లిఫ్ట్, ఇది ప్రధానంగా భారీ వస్తువులను తీసుకెళ్లడానికి ఉపయోగించబడుతుంది. అలోక్ వైర్‌లతో ఇబ్బంది పడుతుండగా, ఒకరు గ్రౌండ్ ఫ్లోర్‌లోని లిఫ్ట్‌లోకి దిగి, రెండవ అంతస్తు కోసం బటన్‌ను నొక్కారని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ పిటిఐ పేర్కొంది. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వైర్లు గొంతు చుట్టు అళ్లుకోవడంతో పాటు.. విద్యుదాఘాతానికి గురయ్యాడని మేము అనుమానిస్తున్నాము. లిఫ్ట్ పైకి రాగానే అతను నుజ్జునుజ్జు అయ్యాడు" అని పోలీసు అధికారి తెలిపారు. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హైటెన్షన్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. మొదట బాలుడిని తన వెంట తీసుకొచ్చానని, ఆడుకుంటున్నాడని చెప్పింది. అనంతరం.. యజమానులు బాలుడిని పనిలోకి నెట్టారని తల్లి ఆరోపించింది. నిర్లక్ష్యం కారణంగా బాలుడి మరణానికి కారణమైనందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. నిందితులపై కార్మిక చట్టాల ప్రకారం కూడా కేసు నమోదు చేయబడుతుంది" అని అధికారి తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు.