తీవ్ర విషాదం...తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 15 మంది చిన్నారులు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik
తీవ్ర విషాదం...తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 15 మంది చిన్నారులు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం 15 మంది చిన్నారులు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందగా.. తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు.
కాగా ఈ ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనను కలిగించాయి. హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో జరిగిన దుర్ఘటనలో 17 మంది సజీవదహనం అయిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.
అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారులు:
హమేయ్ (7), ప్రియాన్ష్ (4), ఇరాజ్ (2), ఆరుషి (౩), రిషబ్ (4), ప్రథమ్ (1Yr 6 months), అనుయాన్ (3), ఇద్దు (4)
ఇక ఏపీలోని చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ కుంటలో పడి గౌతమి (7), షాలిని (6), అశ్విన్ (7) మరణించారు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో కారులో చిక్కుకొని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు. కాగా ఈ ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించాయి.