పుణెలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్‌ తయారు చేసే ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 14 మంది కార్మికులు మృత్యువాత పడ్డార‌ని.. మొత్తం 17 మంది కార్మికులు గల్లంతైనట్లు కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి. ప్రమాదం సమయంలో మొత్తం 37 మంది పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం.

ప్రమాద ఘ‌ట‌న‌పై స‌మాచారం అందిన వెంట‌నే భారీ ఎత్తున ఫైర్‌ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తీసుకురావ‌డం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఇతర సహాయక సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 20 మందిని సురక్షితంగా కాపాడినట్లు స‌మాచారం.సామ్రాట్

Next Story